ప్రియుడి మోజులోపడి కన్నబిడ్డలను దారుణంగా..

ప్రియుడి మోజులోపడి ఆమె రాక్షసిగా మారింది. కన్నబిడ్డలపైనే కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ప్రియుడితో కలిసి ఇద్దరు చిన్నారులను దారుణంగా హింసించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
భర్త ఓంప్రకాష్ తో వివాదాలు రావడంతో.. రూప అనే మహిళ ప్రియుడు రాజేష్ తో 5 నెలలుగా సహజీవనం చేస్తోంది. ఈ బంధానికి తన ఇద్దరు పిల్లలు హేమశ్రీ, శ్రీ ప్రియ అడ్డుగా ఉన్నారని భావించింది. ప్రియుడితో కలిసి వారిద్దరినీ ఎలక్ట్రిక్ వైర్లతో కొడుతూ.. ఇనుప కత్తితో కాల్చి వాతలు పెట్టారు. ఇద్దరూ కలిసి కొద్ది రోజులుగా పిల్లలను దారుణంగా హింసిస్తున్నారు. దెబ్బలను తట్టుకోలేక పిల్లలిద్దరూ విషయాన్ని తండ్రి తరపు బంధువులకు తెలిపారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పిల్లల తల్లితోపాటు.. ప్రియుడిపైనా కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com