సీక్రెట్.. ఎవరికీ చెప్పొద్దు.. రెజీనా ఎంగేజ్‌మెంట్!!

సీక్రెట్.. ఎవరికీ చెప్పొద్దు.. రెజీనా ఎంగేజ్‌మెంట్!!
X

సెలబ్రిటీల పెళ్లిళ్లూ వార్తే.. విడాకులూ వార్తే.. తాజాగా టాలీవుడ్ నటి రెజీనా ఎంగేజ్‌‌మెంట్ జరిగిపోయిందని తమిళనాడుకు చెందిన ఓ నేషనల్ న్యూస్ మ్యాగజైన్ వార్త రాసింది. ఈనెల 13న చెన్నైలో బంధువులు, స్నేహితుల సమక్షంలో రెజీనా నిశ్చితార్ధం చేసుకున్నారని వార్త సారాంశం. పెళ్లి ఈ ఏడాది చివర్లో చేసుకోనున్నారని రాసింది. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ దీనిపై రెజినా స్పందించలేదు. మరి మౌనం అర్ధాంగీకారమా.. ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. పెళ్లెప్పుడు అని ప్రశ్నించే వారికి టైం లేదని హీరోయిన్లు సమాధానం చెప్పడం పరిపాటి. రెజీనా ఏం చెప్తుందో చూడాలి.

Next Story

RELATED STORIES