ఏంటీ.. ఉమ్ము కూడా అమ్ముతారా.. కిలో ఒక కోటీ డెబ్బై లక్షలా..!!

ఏంటీ.. ఉమ్ము కూడా అమ్ముతారా.. కిలో ఒక కోటీ డెబ్బై లక్షలా..!!
X

అసలీ ఉమ్మేంటి.. దానికి సేకరించి అమ్మడం ఏంటి.. అది అంత విలువేంటి.. ఇంతకీ దేనికి ఉపయోగిస్తారో.. ఏ జీవ రాసి ఉమ్మో కదా ఇది.. తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది కదూ.. స్పెర్మ్ వేల్ (తిమింగలాల్లో ఒక జాతి). ఇది ఒక రమైన సముద్ర జీవి. ఇది నోటి ద్వారా మైనం లాంటి పదార్థాన్ని వదులుతుంది. దీన్ని ఆంగ్లంలో యాంబర్ గ్రిస్ అంటారు. ఈ జీవి పేగుల్లో ఉత్పత్తి అయ్యే ఒక రకమైన ద్రవ పదార్థం ఇది. ఈ పదార్థాన్ని ఖరీదైన సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారట. అందుకే కిలో కోటి డెభ్బై లక్షలు పెట్టి కొంటారట.

సాధారణంగా స్పెర్మ్ వేల్స్ ఉష్ణమండల సముద్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా నాగపూర్‌కి చెందిన రాహుల్ తుపారే అనే వ్యక్తి ఈ వేల్ ద్రవపదార్ధాన్ని సంపాదించి ముంబయి మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం అతడికి ఆ పదార్ధాన్ని అమ్మిన వ్యక్తి గుజరాత్‌కు చెందిన లలిత్ వ్యాస్ అని తెలుసుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఈ పదార్థానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అక్రమంగా తరలిస్తుంటారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ యాంబర్‌గ్రిస్‌ను మండిస్తే లక్ష్మీపుత్రులవుతారనే ఒక మూఢనమ్మకం ప్రజల్లో ఉంది. ఇంత ఖరీదైన ఈ పదార్థాన్ని అనుమతుల్లేకుండా కలిగిఉండడం అనేది చట్టరీత్యా నేరం అని పోలీసులు తెలియజేస్తున్నారు.

Next Story

RELATED STORIES