నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. పోలీసులకు వీక్లీఆఫ్‌..

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. పోలీసులకు వీక్లీఆఫ్‌..

ఏపీ పోలీస్‌ బాబాయ్‌ల దశాబ్దాల కల నెరవేరింది! ఇవాల్టి నుంచే వారికి వీక్లీ ఆఫ్‌లు అమలు చేస్తోంది జగన్‌ ప్రభుత్వం.పోలీసులకూ వీక్లీ ఆఫ్‌లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై చర్యలు చేపట్టారు. సాధ్యాసాధ్యాలపై వేసిన కమిటీ రిపోర్ట్ ఇవ్వటంతో డీజీపీ గౌతమ్‌‌ సవాంగ్.. వీక్లీ ఆఫ్ అమలు తీరుపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. వీక్లీ ఆఫ్‌ అమలుకు మొత్తం 19 మోడల్స్ ఎంపిక చేశారు. యూనిట్ ఆఫీసర్లు ఏదో ఒక మోడల్ ని సెలక్ట్ చేసుకోవచ్చంటున్నారు ఉన్నతాధికారులు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్ స్పెక్టర్ స్థాయి వరకు దీన్ని అమలు చేస్తున్నారు.

ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వస్తుందో తెలియదు. ఎక్కడ ఏం జరిగినా పోలీసులు అక్కడ ఉండాల్సిందే. వీఐపీలు వచ్చినా.. మీటింగ్ జరిగినా.. గొడవలు, పండగలు, జాతరలు ఇలా ఏ కార్యక్రమం జరిగినా పోలీసులు ఉండాల్సిందే. దీంతో పోలీసులకు సెలవులే దొరకడం లేదు. ఇక వీక్లీ ఆఫ్ సంగతి సరేసరి..! అయితే.. తమకు కూడా ఇతర ఉద్యోగుల్లాగే వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలంటూ ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు పోలీసులు. ప్రభుత్వాలు మారాయి.. దశాబ్దాలు గడిచాయి కానీ.. పోలీసులకు వీక్లీ ఆఫ్ మాత్రం కలగానే మిగిలిపోయింది. కానీ.. కొత్తగా ఏర్పడిన జగన్‌ ప్రభుత్వం... ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంది. ఇవాల్టి నుంచి పోలీసుల బాబాయ్‌లకూ వీక్లీ ఆఫ్ లు అమల్లోకి తెచ్చింది.

పోలీసు శాఖలో ఇప్పటికే 12 వేల 300 ఖాళీలు ఉన్నాయి. వీక్లీ ఆఫ్ లు ఇస్తే సిబ్బంది కొరత సమస్య మరింత పెరుగనుంది. అయితే.. సిబ్బంది కొరత సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టారు పోలీసు అధికారులు. వీక్లీ ఆఫ్‌పై ప్రతి రెండు నెలలకు ఫీడ్ బ్యాక్ తీసుకొని మార్పులు చేర్పులు చేస్తామంటున్నారు ఇప్పటికే విశాఖ, కడప, ప్రకాశం జిల్లాలో ఈ ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఈ విధానంపై అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా అమలుకు నోచుకొని వీక్లీ ఆఫ్ లను ఎట్టకేలకు అమలులోకి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఏపీ సీఎం జగన్, డీజీపీ సవాంగ్ కు రుణపడి ఉంటామంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story