కాంగ్రెస్‌ నేతలపై యోగా గురు రాందేవ్‌బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ నేతలపై యోగా గురు రాందేవ్‌బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రఖ్యాత యోగా గురు రాందేవ్‌ బాబా కాంగ్రెస్‌ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగా చేయకపోవడం వల్లే వారు అధికారానికి దూరమయ్యారని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ యోగాచేసేవారని.. అయితే వారి వారసులెవరూ యోగా చేయడంలేదన్నారు. యోగాను గౌరవించనందువల్లే వారు అధికారంలోకి రాలేకపోయారన్నారు. యోగా చేసేవాళ్లకు భగవంతుడి ఆశీస్సులు ప్రత్యక్షంగా ఉంటాయన్నారు బాబా.

ప్రజల మధ్యన ఉంటూ ప్రధాని మోదీ ఒక్కరే యోగా చేస్తున్నారని కితాబిచ్చారు. బీజేపీ కేంద్ర మంత్రులు, సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా యోగా చేస్తుండటాన్ని ప్రశంసించారు రాందేవ్‌బాబా. ఆర్టికల్ 370, ట్రిపుల్‌ తలాఖ్‌ వంటి అంశాలపై ప్రధాని మోదీ ఆధ్వర్యంలో గొప్ప పనులు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు బాబా. జూన్‌ 21న ఇంటర్నేషనల్‌ యోగా డే సందర్భంగా నాందేడ్‌లో జరిగే యోగా కార్యక్రమాల్లో బాబా రాందేవ్‌ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా పాల్గొంటున్నారు. రాజకీయాలు, కులం, నమ్మకం, మతాలకు అతీతంగా యోగా చేయాలని వారసత్వంగా లభించిన గొప్పవరమన్నారు రాందేవ్‌బాబా.

Tags

Read MoreRead Less
Next Story