నా సక్సెస్ సీక్రెట్ ఆమే.. ఆమె లేకపోతే నేను లేను..

నా సక్సెస్ సీక్రెట్ ఆమే.. ఆమె లేకపోతే నేను లేను..
X

సినిమాల్లో వంద మంది విలన్లు వచ్చినా ఒంటి చేత్తో రఫ్ ఆడించగలడు. మరి ఆ సినిమాలో అతడే హీరో. అంతే కాదు అందాల హీరోయిన్‌ని తనవైపు తిప్పుకోగలడు. అదంతా సినిమాల్లో వరకే. అదే ఇంట్లో అయితే అంత పెద్ద హీరో కూడా ఆమె మాట జవదాటరు. ఆమె లేకపోతే క్షణమైనా తోచదు. ఏం చెయ్యాలో తెలియదు. ఏమీ చేతకాదు. ఆర్థిక అవసరాల నుంచి ఆయనకు ఏం కావాలో అన్నీ ఆమే చూసుకుంటుంది. అందుకే నమ్రత, మహేష్‌ల జోడీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతుంది. పెళ్లై 14 ఏళ్లు అయినా ఏ చిన్న గొడవా లేకుండా.. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన భార్య నమ్రత గురించి మనసులో మాట చెప్పాడు మహేష్.

ఆమె లేకుండా నేను లేనని.. నమ్రత లేకుండా తనకే పనీ చేత కాదని గొప్పగా చెప్పుకుంటాడీ సూపర్ స్టార్. తానీరోజు ఇంత హాయిగా ఉండడానికి.. కూల్‌గా సినిమాలు చేసుకోవడానికి భార్య నమ్రతే కారణమంటున్నాడు. టెన్షన్స్ అన్నీ ఆమే తీసుకుంటుందని.. ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తుందని అంటాడు. సినిమాల విషయంలోకాని.. యాడ్స్ విషయంలో కానీ.. వ్యక్తిగత జీవితం విషయంలో కానీ అన్నింట్లో నమ్రత పాత్ర చాలా కీలకమంటాడు మహేష్. తను పిల్లలు సితార, గౌతమ్‌లను గారాబం చేస్తే, నమ్రత మాత్రం వారి విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని చెప్పాడు. అందుకే నమ్రత లేక పోతే మహేష్ లేడు అంటూ తన మనసులో భార్యకున్న స్థానాన్ని వివరించాడు మహేష్.

Next Story

RELATED STORIES