ప్రియుడి మోజులోపడి రాక్షసిగా మారి.. ఈమె చేసిన పని చూస్తే..

ప్రియుడి మోజులోపడి రాక్షసిగా మారి.. ఈమె చేసిన పని చూస్తే..
X

అక్రమ సంబంధాలు నానాటీకి పెచ్చుమీరిపోతున్నారు. పరాయి మగాడి మోజులో పడి నాగర్ కర్నూల్ స్వాతి తన భర్తను చంపి.. అతడి స్థానంలో ప్రియుడిని తీసుకురావడానికి ప్రయత్నించిన ఉదంతం ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచేలా చేసింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్నతల్లే పిల్లలను చిత్ర హింసలకు గురి చేసిన ఉదంతాలెన్నో బయపట్టాయి.. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని గౌతంపూర్ కాలనీలో వెలుగు చూసింది. ప్రియుడి మోజులోపడి ఆమె రాక్షసిగా మారింది. కన్న పిల్లలపైనే కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ప్రియుడితో కలిసి ఇద్దరు చిన్నారులను దారుణంగా హింసించింది.

భర్త ఓంప్రకాష్ తో వివాదాలు రావడంతో...రూప అనే మహిళ ప్రియుడు ఆటోడ్రైవర్‌ రాజేష్ అనే వ్యక్తితో 5 నెలలుగా సహజీవనం చేస్తోంది.. ఈ దొంగ చాటు బంధానికి తన ఇద్దరు పిల్లలు హేమశ్రీ, శ్రీ ప్రియ అడ్డుగా ఉన్నారని భావించింది. ప్రియుడితో కలిసి వారిద్దరినీ ఎలక్ట్రిక్ వైర్లతో కొడుతూ.. ఇనుప కత్తితో కాల్చి వాతలు పెట్టింది. ఇద్దరూ కలిసి కొద్ది రోజులుగా పిల్లలను దారుణంగా హింసలకు గురిచేశారు.

రూప వదిన తన ఆడపడుచు ఇంటికి వెళ్లగా.. ఇద్దరు పిల్లలు గాయాలతో కనిపించారు. దీంతో ఏమైందని అడగ్గా.. రాజేశ్‌తో కలిసి చిత్రహింసలకు గురి చేసిందని అత్తకు చెప్పి వాపోయారు. వారిద్దరూ తమను బెల్టుతో కొట్టారని, కత్తి కాల్చి వాతలు పెట్టారని చెప్పి విలపించారు. దీంతో వారిద్దరిపై చిన్నారుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story

RELATED STORIES