రిమోట్‌తో స్టార్ట్ చేసే 'రివోల్ట్' ఎలక్ట్రిక్ బైక్.. మరిన్ని ఫీచర్లతో మార్కెట్లోకి..

రిమోట్‌తో స్టార్ట్ చేసే రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్.. మరిన్ని ఫీచర్లతో మార్కెట్లోకి..

రివోల్ట్ ఇంటెల్లీ కార్పొరేషన్ కంపెనీ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. రివోల్ట్ RV 400 బైక్.. ఇండియాలో ఫస్ట్ AI ఎనేబుల్డ్ బైక్‌ను రివోల్ట్ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రిమోట్ స్టార్ట్ సపోర్ట్‌తో కూడిన ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి. రియల్ టైం ఇన్ఫర్మేషన్, డయాగ్నిస్టిక్స్, జియో ఫెన్సింగ్, OTA అప్ డేట్ సపోర్ట్, బైక్ లొకేటర్, ఆర్టిఫీషియల్ ఎగ్జాస్ట్ సౌండ్ సిస్టమ్ లోడై ఉన్నాయి. ఇలా ఎన్నో ఫచర్లతో యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్న ఈ బైక్‌లో ఆకర్షించే ఫీచర్.. ఆన్ లైన్ రీచార్జ్ ఎబిలిటీ. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బైక్‌కు సంబంధించిన బ్యాటరీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.

ఇక ఈ బైకులోని బ్యాటరీ బరువు ఒక్కొక్కటీ 18 కిలోల వరకు ఉంటుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రీజనరేటివ్ బ్రాకింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ RV బైక్ స్పెషాలిటీస్. 3 రకాల మోడల్స్‌తో మార్కెట్లోకి వస్తున్న ఈ బైక్‌లో ఎకో, సిటీ, స్పోర్ట్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 156 కిలోమీటర్లు వస్తుంది. లిమిటెడ్ స్పీడ్ 85kmph వరకు ఉంటుంది. బ్యాటరీలను 15 అంపెర్ సాకెట్‌తో నాలుగు గంటలు ఛార్జ్ చేసుకోవచ్చు. ధర ఎంతన్నదీ అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ ఈ బైక్ లాంచింగ్ కార్యక్రమాన్ని వచ్చే నెలలో చేసేందుకు షెడ్యూల్ ప్రకటించింది.

జూన్ 25 నుంచి బైక్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. ఢిల్లీ కస్టమర్లు రూ.100 టోకెన్‌పై బైక్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ వెబ్ సైట్ ద్వారా కూడా బుక్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది కంపెనీ. వచ్చే నాలుగు నెలల్లో బైక్‌ల ఉత్పత్తిని NCR, పూణె, బెంగళూరు, హైదరాబాద్, నాగపూర్, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో విస్తరించనుంది. రెండు కలర్స్ ఒకటి రెబల్ రెడ్, రెండు కాస్మిక్ బ్లాక్ కలర్లలో మార్కెట్లో రిలీజ్ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story