సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ కాపురానికి పనికిరాడంటూ భార్య..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ కాపురానికి పనికిరాడంటూ భార్య..
X

సంసారానికి పనికి రాకున్నా తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. కేవలం పరువు కోసం, కట్నం కోసం తన జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. చిత్తూరు పాకాలకు చెందిన శ్యాంప్రసాద్ నాయుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పాకాల మండలంలోని మొరవపల్లెకు చెందిన దీపికను అతను వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో కాపురం పెట్టాడు. భవిష్యత్తుపై బంగారు కలలతో భర్తతో కలిసి ఏడడుగులు వేసిన దీపికకు.. ఏడు రోజుల్లోనే భర్త గుట్టు తెలిసిపోయింది. అతను కాపురానికి పనికి రాడని నిర్ధారించుకుంది.

భర్త లోగుట్టు తెలిసిన దీపిక అతని దగ్గర దొరికిన ప్రిస్కిప్షన్ డాక్టర్లకు చూపించి విషయం కన్ఫమ్ చేసుకుంది. భర్తతో పాటు అత్తమామలను నిలదీసిందామె. ఇంటి గుట్టు బయటపెట్టొద్దని బ్రతిమిలాడారు. పరువు కోసం దీపిక కూడా భరించింది. కానీ, కోడలి పట్ల జాలి కూడా చూపించని ఆ అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు. దీపిక పుట్టింటివారు బ్రతిమిలాడిన పట్టించుకోలేదు. దీంతో అసలు రహస్యాన్ని బయటపెట్టిన దీపిక తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

Next Story

RELATED STORIES