రాష్ట్రంలో మొదలైన రాజకీయ ప్రకంపనలు : ఎమ్మెల్సీ సోము వీర్రాజు

X
TV5 Telugu21 Jun 2019 5:43 AM GMT
రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు చేరారని... ఏ పార్టీ నుంచి నాయకులు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు సోము వీర్రాజు. 2024 నాటికి ఏపీలో బీజేపీ ఒక ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాలించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందన్నారు.
Next Story