కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం

కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం

యావత్ తెలంగాణ ఎదురుచూసిన అద్భుత ఘట్టం ఆవిష్కరృతమైంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో ఏపీ,మహారాష్ట్ర సీఎంలు జగన్‌, పడ్నవీస్‌ పాల్గొన్నారు. తెలుగురాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సమక్షమంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా కాళేశ్వం ప్రాజెక్ట్‌ శిలాపలకాన్ని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించగా.... మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో... సీఎం కేసీఆర్‌ రిబ్బన్‌ కట్‌ చేసి... మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.

అంతకుముందు.... మేడిగడ్డ వద్ద కేసీఆర్ దంపతులు కాళేశ్వర జల సంకల్ప యాగం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. హోమయజ్ఞం పూర్తి చేసిన అనంతరం... మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు సీఎం కేసీఆర్.

అనంతరం కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకున్నారు సీఎం కేసీఆర్‌. కాసేపట్లో పంపుహౌజ్ 6వ స్విచ్‌ను ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి గోదావరి నీటిని అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలోనూ ఏపీ జగన్‌ ‌, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, తెలుగురాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొంటున్నారు.

మరోవైపు... అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్‌రెడ్డి, అన్నారం పంపుహౌజ్‌ను మంత్రి మహమూద్‌అలీ , సుందిల్ల బ్యారేజీని మంత్రి మల్లారెడ్డి, పంపుహౌజ్‌ను కొప్పుల ఈశ్వర్‌లు ప్రారంభిస్తారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టైన కాళేశ్వరంలో 9 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. మేడిగడ్డ నుంచి మొదలై.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ వరకూ గోదావరి జలాలు పరుగులుపెట్టబోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story