ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి.. రన్స్ జాబితాలో టాప్ ప్లేస్..

X
TV5 Telugu21 Jun 2019 11:29 AM GMT
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్నారు. వరుస సెంచరీలతో రెచ్చిపోతున్నాడు. ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి వచ్చిన వార్నర్ ప్రస్తుత ప్రపంచకప్ మోస్ట్ రన్స్ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌పై శతకం చేసిన వార్నర్ తాజాగా బంగ్లాదేశ్‌పైనా మరో సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ అభిమానులు ఛీటర్ అంటూ పలు మ్యాచ్‌లలో కామెంట్స్ చేసినా... వారికి ఆటతోనే సమాధానమిచ్చాడు. ప్రస్తుతం 6 మ్యాచ్‌లలో 89.40 యావరేజ్‌తో 447 పరుగులు చేశాడు. దీనిలో రెండు సెంచరీలు ఉండగా... రానున్న మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లకు వార్నర్‌తోనే ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది.
Next Story