సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
X

సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. చిలుకూరు మండలం మిట్స్‌ కాలేజీ సమీపంలోని గోదాముల దగ్గర ఓ ఆటోని ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. భయంతో లారీ డ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Next Story

RELATED STORIES