నేత కార్మికుల కష్టం వెండి తెరపై ఆవిష్కృతం.. 'మల్లేశం'.ట్విట్టర్ రివ్యూ..

నేత కార్మికుల కష్టం వెండి తెరపై ఆవిష్కృతం.. మల్లేశం.ట్విట్టర్ రివ్యూ..

తెలుగు తెరపై ఆవిష్క్రృతమైన యదార్థ జీవిత కథ మల్లేశం. పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కార్మికుల కోసం ఆసుయంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవిత కథే ఈ చిత్రం. మల్లేశం పాత్రలో ప్రియదర్శన్ ఒదిగిపోయారు. ఒక చీర నేయాలంటే దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఆ విధంగా రోజుకి 18 వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే రెండు చీరలు మాత్రమే నేయగలుగుతారు నేత కార్మికులు. రెండు చీరలన్నా నేస్తేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయి. తల్లి లక్ష్మి కష్టాన్ని చూసిన మల్లేశం ఏడేళ్లు కష్టపడి ఆసు యంత్రాన్ని రూపకల్పన చేస్తాడు. ఈ కథ అంతా మనసుకు హత్తుకునేలా ఎంతో హృద్యంగా మలిచారు దర్శకుడు రాజ్ ఆర్. సురేష్ ప్రొడక్షన్ ద్వారా రిలీజైన ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా అనన్య నటించింది. మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ జీవించింది. మార్క్ కే రోబిన్ సంగీతం అందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ట్విట్టర్ వేదికగా 'మల్లేశం' చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంది

Tags

Read MoreRead Less
Next Story