టిక్‌టాక్ మోజు.. మెడలో మంగళసూత్రం వేసుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్లి..

టిక్‌టాక్ మోజు..  మెడలో మంగళసూత్రం వేసుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్లి..
X

ఇంకా ఎంత మంది ఈ టిక్ టాక్‌కి బలవుతారు. సరదా సంభాషణలు కాస్తా సీరియస్ అవుతున్నాయి. వేరే పనేమీ లేనట్లు అస్తమాను అదేపని. సమయం ఎంత విలువైందో.. అన్నింటికంటే జీవితం మరింత విలువైందని అసలు గుర్తించలేకపోతున్నారు. ఇది వరకు సెల్ఫీలు.. ఆ తరువాత బ్లూవేల్ గేమ్.. మొన్నటి దాకా పబ్‌జీ.. ఇప్పుడు టిక్ టాక్. జీవితాల్ని చిధ్రం చేసే ఈ పనులు ఎందుకు. తాజాగా రాజస్థాన్ కోటాకు చెందిన 12 ఏళ్ల బాలుడు టిక్ టాక్‌కు బానిసయ్యాడు. తల్లిదండ్రులు వారించినా వినకుండా టిక్‌టాక్‌లోనే మునిగిపోయేవాడు. ఏదో సరదా పడుతున్నారని ముందు తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. అదే చివరకు ప్రాణాలను హరిస్తుందని గుర్తించలేకపోతున్నారు. ఆరోతరగతి చదువుతున్న ఆ బాలుడు టిక్ టాక్ వీడియోలకు ఆకర్షితుడై తను కూడా ఓ సెల్ఫీ వీడియో తీయాలనుకున్నాడు. అందులో భాగంగానే తల్లి మంగళ సూత్రాన్ని మెడలో వేసుకుని, గాజులు తొడుక్కుని బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. వీడియో తీస్తున్న క్రమంలో బాలుడి మెడలో ఉన్న మంగళసూత్రం బాత్రూం తలుపు సందులో చిక్కుకుపోయింది. దీంతో మంగళసూత్రం మెడకు చుట్టుకుని బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాత్‌రూం లోపలికి వెళ్లిన పిల్లాడు ఇంకా రాలేదని కంగారు పడ్డ తల్లిదండ్రులు తలుపులు పగుల గొట్టి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఆ విధంగా చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Next Story

RELATED STORIES