Top

ఆ నేతలు టీడీపీకి గుడ్‌ బై చెప్తారని ప్రచారం

నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు... బీజేపీలో చేపడాన్ని తెలుగుదేశం ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీలో పదవులు అనుభవించి... ఓడిపోగానే పార్టీ మారడం దారుణమని మండిపడ్డారు. వారంతా స్వప్రయోజనాలకే పార్టీ మారారు తప్ప... రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. పార్లమెంటరీ పక్షాన్ని‌ బీజేపీలో విలీనం చేయాలంటూ నలుగురు ఎంపీలు ఇచ్చిన లేఖ చట్ట ప్రకారం చెల్లదన్నారు ఎంపీ గల్లా జయదేవ్‌..

సొంత ప్రయోజనాల కోసమే ఆ నలుగురు పార్టీ మారారని విమర్శించారు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. ఆ నలుగురు చేసింది విలీనం కాదని.. కేవలం పార్టీ ఫిరాయింపులే అన్నారు ఆయన. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం దురదృష్టకరమన్నారు కనకమేడల. రాజ్యసభ ఛైర్మన్‌కు ఇచ్చిన లేఖతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమతో కనీసం చర్చ జరపకుండా పార్లమెంటరీ పార్టీని ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఎంపీ కేశినేని నాని ఖండించారు. ప్రజల కోసం ఏపీ సీఎం జగన్‌ వద్దకు.. ప్రధాని వద్దకు.. మంత్రుల వద్దకైనా వెళ్తానని.. కానీ పార్టీ మారనని స్పష్టం చేశారు. ఏపీకి ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదని స్పష్టం చేశారు.

పార్టీ పిరాయింపులను చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు అన్నారు గద్దె రామ్మోహన్‌ రావు. బీజేపీలోకి వెళ్లిన ఎంపీలు కేవలం తమ స్వప్రయోజనాల కోసమే వెళ్లారని.. ఐదేళ్లలో సాధించని విభజన హామీలు.. ఇప్పుడు ఎలా సాధిస్తారని గద్దె రామ్మోహన్‌ నిలదీశారు.

నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ పిరాయింపు సమయంలో కాకినాడలో కాపు సమాజిక వర్గానికి చెందిన నేతలంతా సమావేశమవ్వడం మరింత కలకలం రేపింది. వారంతా పార్టీ మారేందుకే ప్రత్యేకంగా భేటీ అయ్యిందని ప్రచారం మొదలైంది. ఆ వార్తలపై కాపు సమాజిక వర్గ నేతలు ఖండించారు. బీజేపీలోగానీ, వైసీపీలోగానీ చేరే ఆలోచనలే లేవని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపైనే తామంతా విశ్లేషించామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసినా ఓటమి పాలయ్యామని పేర్కొన్నారు.

మొన్నటి వరకు రాజ్యసభ సభ్యులు సైతం ఇదే మాట చెబుతూ వచ్చారు. పార్టీ మారాల్సిన అవసరం ఏముందంటూ సమాధానాలు చెప్పిన నేతలంతా.. ఒక్కరోజులోనే ప్లేట్‌ పిరాయించారు. ఇప్పుడు కాకినాడలో కాపు నేతలపై సమావేశంపైనా ఇదే చర్చ మొదలైంది. వారు తమ రాజకీయ భవిష్యత్తుపై చర్చించుకునేందుకే ప్రత్యేంగా భేటీ అయ్యారని.. త్వరలో చాలామంది నేతలు టీడీపీకి గుడ్‌ బై చెప్పేస్తారని ప్రచారం జరుగుతోంది.

Next Story

RELATED STORIES