పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తిని నరికి..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా నరికి చంపారు. చనిపోయిన వ్యక్తిని నాగుల రవిగా గుర్తించారు. బైక్ పై వెళ్తున్న రవిని సినీఫక్కీలో వెంబడించారు ముగ్గురు దుండగులు. కత్తులతో కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాగుల రవి ఎవరు? అతడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో విచారిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES