ఎన్టీఆర్ తోపాటు వైయస్సార్ ఫొటో కూడా పెట్టాలి : వైసీపీ కార్పొరేటర్లు

ఎన్టీఆర్ తోపాటు వైయస్సార్ ఫొటో కూడా పెట్టాలి : వైసీపీ కార్పొరేటర్లు

విజయవాడ కార్పొరేషన్‌లో ఫొటోల రగడ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తనను అడగకుండా కౌన్సిల్ హల్‌లో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టడంపై మేయర్ శ్రీధర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే అక్కడున్న ఎన్టీఆర్‌, చంద్రబాబు ఫొటోలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. సీఎం జగన్ ఫొటోను ఏర్పాటు చేశారు. దీనిపై మేయర్ అసహనం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఫొటో తీసేసినా పర్వాలేదు.. NTR ఫొటోపై ఎందుకు అభ్యంతరం అని నిలదీశారు. తిరిగి ఫొటోను అక్కడ పెట్టాలని ఆదేశించారు. దీనిపై YCP కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. NTR తోపాటు YSR ఫొటోలు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు.

ఐతే.. రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం ఉంచేందుకు మేయర్ ఒప్పుకోలేదు. దీంతో.. కాసేపు వాగ్వాదం జరిగింది. దివంగత నేతల ఫొటోలు పెట్టడం సంప్రదాయంగా వస్తోందని అందులో తప్పేమీ లేదని వైసీపీ కార్పొరేటర్లు అన్నారు. ఆ రెండు ఫొటోలు పెట్టాలంటూ ఆందోళనకు దిగారు. ఐతే.. మేయర్‌గా తన నిర్ణయమే ఫైనల్ అని చెప్పిన శ్రీధర్.. తాను చెప్పినట్టే చేయాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, ఈ గందరగోళం మధ్యే సభ అరగంటపాటు వాయిదా పడింది. ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోల తొలగింపుపై కార్పొరేషన్ అధికారులు క్షమాపణలు చెప్పాలని మేయర్ ఆదేశించారు.

Read MoreRead Less
Next Story