తాజా వార్తలు

సర్ఫరాజ్‌ను సైబరాబాద్ పోలీసులు వాడేసుకున్నారుగా..!!

సర్ఫరాజ్‌ను సైబరాబాద్ పోలీసులు వాడేసుకున్నారుగా..!!
X

వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భాగంగా భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన క్రికెట్ అభిమానులు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇప్పటికే అతడి కెప్టెన్సీని, పాక్ క్రికెటర్ల ఆటతీరుని విమర్శిస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కూడా సర్ఫరాజ్ ఫోటోని వాడేసుకున్నారు. ఇటీవల జరిగన మ్యాచ్‌లో సర్ఫరాజ్ గట్టిగా ఆవలిస్తున్న ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ ఫోటోని ఆధారంగా చేసుకుని సైబరాబాద్ పోలీసులు.. ''నిద్ర వస్తున్నా.. ఆపుకుని మరీ బలవంతంగా డ్రైవింగ్ చేయకండి. అది చాలా డేంజర్'' అని కామెంట్ పెట్టారు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ ఫోటో చూసి.. సైబరాబాద్ పోలీసుల సెన్సాఫ్ హ్యూమర్‌ని మెచ్చుకుంటున్నారు. సెభాష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.c

Next Story

RELATED STORIES