పెళ్లింట విషాదం.. నలుగురి మృతి

పెళ్లింట విషాదం.. నలుగురి మృతి
X

పెళ్లితో కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా మృత్యుఘెష వినిపించింది. నవ్వుల దించించాల్సిన ఆ కుటుంబంలో విషాద చాయాలు నెలకొన్నాయి. పారాని ఆరకముందే పెళ్లి కొడుకు మృత్యుఒడికి చేశాడు. కరంట్ కాటుకు ఒకే కుటుంబంలో నలుగురు బలి అయ్యారు. యాదాద్రి జిల్లా ముక్తాపూర్‌ గ్రామంలో పెళ్లింట విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన రెండో రోజే విద్యుదాఘాతంతో పెళ్లి కుమారుడు, అతడి తల్లిదండ్రులు, మేనత్తతో సహా నలుగురు ఒకేసారి మృతి చెందారు.

చిందం సాయిలు తన కుమారుడికి ఈనెల 19న వివాహం జరిపించాడు. పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా పెళ్లికుమార్తె ఇంట్లో శుభకార్యం ముగించుకొని తిరిగి ముక్తాపూర్‌ చేరుకున్నారు. వర్షంతో సాయిలు తడిసిన షర్ట్‌ను జీఐ వైర్‌తో ఉన్న దండెంపై ఆరవేయగా ఒక్కసారిగా సాయిలుకు కరెంట్ షాక్ తగిలింది. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన నవ వరుడు ప్రవీణ్‌తోపాటు సాయిలు భార్య గంగమ్మ, సాయిలు సోదరి గంగమ్మ కూడా విద్యుత్ షాక్ తగిలింది. వీరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్సకు హైద్రాబాద్ ఆస్పత్రికి తలరిస్తుండగా మృతి చెందారు.

సాయిలు పెద్ద కుమారుడు భాస్కర్ కూడా వారిని పట్టుకోగా అతనికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లితో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనతో ఆహాకారాలు మిన్నంటాయి. నవవరుడు మృతితో నవవధువు కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

RELATED STORIES