సర్ఫరాజ్‌కు చేదు అనుభవం

సర్ఫరాజ్‌కు చేదు అనుభవం

ప్రపంచకప్‌లో బాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఓడిపోవడంపై ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. అతన్ని ఘోరంగా అవమానించాడు. లండన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్ళిన సర్ఫరాజ్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. ఇంతలో తన కొడుకు ఏడవడంతో పక్కకు వెళ్లిపోయాడు సర్ఫరాజ్‌ . అతను పక్కకు వెళ్ళడం చూసిన పాక్ అభిమాని కోపంతో ‘సర్ఫరాజ్‌ బాయ్‌...లావు అవుతున్నారు ఎందుకిలా పందిలా ఉన్నారు..డైట్ ఫాలో అవోచ్చుగా" అంటూ అభ్యంతరకర పదజాలంతో దూసించాడు. కానీ సర్ఫరాజ్‌ అతని మాటలు ఏవి పట్టించుకోకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ వీడియో కాస్త వైరల్‌ కావడంతో సర్ఫరాజ్‌కు పలువురు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ అభిమాని తీరుపై నెటిజన్లు ఫైరవుతున్నారు. గెలుపోటములు సహజమేనని అంతమాత్రాన వారిపై అలా దుషణకు దిగడం సరికాదని అంటున్నారు. జాతి కోసం పనిచేసే వారిని హీరోలు అనుకోవాలే తప్ప ఇలా కించపరచకూడదని ట్వీట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై సర్ఫరాజ్‌ కూడా స్పందించాడు. " అన్ని సమయంలో అందరికి సహానం ఉండదు. ఒక రోజు గొప్పవాళ్ళు కూడా సహనాన్ని కోల్పోతారు. అప్పుడు వాళ్లు స్పందించే విధానం వేరేగా ఉంటుంది. ఇలాంటి ఘటనలే అభిమానుల నుంచి దూరంగా ఉండాల్సి పరిస్థితి తెస్తుంది"అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశాడు.

ఇలా ఆ అభిమానిపై విమర్శలు వెల్లువెత్తడంతో అతని చివరకు ట్విటర్‌లో వీడియో సందేశాన్ని పెడుతూ సర్ఫరాజ్‌‌ను క్షమపణలు కోరాడు.

Tags

Read MoreRead Less
Next Story