తల్లిదండ్రులకు శాపంగా మారిన పిల్లల చదువులు

తల్లిదండ్రులకు శాపంగా మారిన పిల్లల చదువులు

ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల ధనదాహం తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. అడ్మిషన్ల కోసం స్కూళ్లవైపు చూడాలంటేనే పేరెంట్స్‌ భయపడుతున్నారు. ఫీజులను నియంత్రాల్సిన విద్యాశాఖ అధికారులకు సామాన్యుల కష్టాలు పట్టడంలేదు. స్కూళ్లు ప్రారంభమయ్యే సీజన్‌లో అక్కడక్కడా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా... పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు.

విద్యా సంవత్సరం మొదలవడంతో స్కూళ్ల హడావుడి షురూ అయింది. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకి ద్వారాలు తెరుచుకున్నాయి. ఏటికేడాది ఫీజులు పెంచేసి తల్లిదండ్రులపై భరించలేని విద్యాభారాన్ని మోపుతున్నారు. ఫీజుల మోతను నియంత్రించాల్సిన విద్యాశాఖకు ఇవేమీ పట్టడంలేదు. అనుమతులున్నా లేకపోయినా యాజమాన్యాలను ప్రశ్నించే ధైర్యం చేయడంలేదు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు పెరుగుతున్న ఫీజుల భారంతో తల్లిదండ్రులు తమ సంపాదనంతా దోచిపెట్టాల్సి వస్తోంది. స్కూల్‌ ఫీజులతోపాటు యూనిఫామ్‌, షూ, బెల్ట్‌, టై ఖర్చులు అదనం. కృష్ణా జిల్లాలోని చిన్న చిన్న పట్టణాల్లో పరిస్థితి ఓ మోస్తరుగా ఉంటే... విజయవాడలో ఈ బాదుడు 50 శాతం అధికం. పిల్లలను బస్సుల్లో పంపాలంటే ట్రాన్స్‌పోర్ట్‌కయ్యే మొత్తం దాదాపు స్కూల్‌ ఫీజుతో సమానంగా ఉంటోంది....Spot

కృష్ణా జిల్లాలో దాదాపు 4 వేల 5 వందల స్కూళ్లుండగా వీటిలో ప్రయివేటు పాఠశాలలు 1400. జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లు వందల కోట్ల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిఏటా ఫీజుల పెంపును తగ్గించాలని డిమాండ్ చేశాయి.

ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసినా ప్రయోజనం శూన్యం. ప్రతిఏటా స్కూల్స్ ప్రారంభమయ్యే సీజన్‌లో ఫీజులపై ఆందోళనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. పిల్లలకు నాణ్యమైన విద్య అందిచాలన్న తల్లిదండ్రుల ఆశల్ని.. ప్రయివేటు స్కూళ్లు ఫీజుల రూపంలో దండుకుంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story