చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం

X
TV5 Telugu23 Jun 2019 10:43 AM GMT
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేతలతో ఫోన్ లో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందన్న వైసీపీ నేతల ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అవాస్తవ ఆరోపణలతో లేని అవినీతిని టీడీపీకి అంటించాలని చూస్తున్నారని వాపోయారు. ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు నేతలు పాటుపడాలని నేతలకు చంద్రబాబు సూచించారు. వైసీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలకు గురైన కార్యకర్తలకు అండగా ఉండాలన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని చెప్పారు. పార్టీ అన్నివేళలా వెన్నుదన్నుగా ఉంటుందనే భరోసా కల్పించాలన్నారు.
Next Story