తెలంగాణ పోలీస్ సిబ్బందికి శుభవార్త

తెలంగాణ పోలీస్ సిబ్బందికి శుభవార్త

తెలంగాణ పోలీస్ సిబ్బందికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరో మూడ్రోజుల్లోనే వీక్లీ ఆఫ్ అమలుచేయనున్నారు. 24 గంటలపాటు విధి నిర్వహణలో ఎంతో మానసిక ఒత్తిడిలో పనిచేసే పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ అమలు చేయనుంది. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల యూనిట్ ఆఫీసర్లకు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

వారంతపు సెలవులపై.. ఇప్పటికే రెండు జోన్ల పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు వెస్ట్‌జోన్ ఇంచార్జి ఐజీ నాగిరెడ్డి. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది మొత్తం సంఖ్యను పరిగణనలోకి తీసుకొని.. వారంలో ఒక్కొక్కరికి ఒక్కోరోజు వీక్లీ ఆఫ్‌ ఉండేలా షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. డ్యూటీ రోస్టర్ చార్ట్‌లో ఒక ప్రత్యేక కాలమ్‌ పెట్టి, రోజుకు ఇద్దరు లేదా ముగ్గురికి వారాంతపు సెలవు కేటాయించుకోవాలని తెలిపారు.

సిబ్బందికి ఏరోజు వారాంతపు సెలవు తీసుకొనేందుకు అనువుగా ఉంటుందో వారినే ఎంపికచేసుకోవాలని పోలీసులను కోరనున్నారు. ఏదైనా రోజుకు ఎక్కువమంది పోటీపడితే.. లాటరీ పద్ధతి అనుసరిస్తారు. రెండ్రోజుల్లోగా అన్ని పోలీస్‌స్టేషన్లలో వారాంతపు సెలవుల కేటాయింపు పూర్తిచేసి, ఎవరు ఏ రోజు సెలవులో ఉంటారన్న సమాచారాన్ని సేకరించనున్నారు. మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి చీఫ్ ఆఫీసర్‌కు పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story