ట్రంప్ కోరిక మేరకు గౌన్ మార్చుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లగా...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ఉన్న సమయంలో అమ్మాయిలతో వ్యవహారాలు నడిపాడని.. లైంగికంగా వేధించాడని ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఓ అమెరికన్ రచయిత్రి ట్రంప్‌పై సంచనల ఆరోపణలు చేసింది. 1995లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు రచయిత్రి జీన్ కరోల్. తన జీవితంలోని అనుభవాల్ని న్యూయార్క్ మ్యాగ్‌జైన్ కవర్ స్టోరీలో రాస్తూ ఈ ఆరోపణలు చేశారు.
మన్‌హట్టన్‌లోని గుడ్‌మ్యాన్ స్టోర్‌లలో తనను కలిసిన ట్రంప్ గర్ల్ ఫ్రెండ్‌కి ఒక గౌను కొన్నానని.. అది వేసుకోని చూడాలని ట్రంప్ తనను కోరారని కరోల్ తెలిపారు. ట్రంప్ కోరిక మేరకు తాను గౌన్ మార్చుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లగా...తనపై ట్రంప్ అత్యాచారం చేశారని కరోల్ ఆరోపించారు. కరోల్ తాను రాసిన కొత్త పుస్తకం వాట్ డూ వి నీడ్ మెన్ ఫర్ పుస్తకం నుంచి కొన్ని భాగాలతో ఈ కథనం రాశారు. ఈ పుస్తకం విడుదల కావల్సింది.
జీన్ కరోల్ ఆరోపణలపై ట్రంప్ స్పందించారు. అసలు కరోల్‌ని తన జీవితంలో ఎప్పుడూ కలవలేదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోల్ తన పుస్తకం అమ్మకాలు పెంచుకోవడానికే ఈ కట్టు కథ అల్లిందన్నాని ఆరోపించారు. ఆధారాలు లేకుండా న్యూయార్క్ మ్యాగజైన్ ఇలాంటి కథనాన్ని ఎలా ప్రచురిస్తుందని నిలదీశారు. అంత పెద్ద స్టోర్‌లో కెమెరాలు ఉండవా? సేల్స్ అటెండర్స్ ఉంటారు కదా? డ్రెస్సింగ్ రూమ్‌లో అత్యాచారం ఎలా సాధ్యం మని ట్రంప్ ప్రశ్నించారు. ట్రంప్ అధికారం పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 మంది మహిళలు ఆయనపై లైంగిక ఆరోపణలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com