Top

భారీ వర్షాల కారణంగా 24 మంది మృతి.. ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

భారీ వర్షాల కారణంగా 24 మంది మృతి.. ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
X

దేశవ్యాప్తంగా నైరుతి పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో పలు రాష్ట్రాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు బీహార్‌లో 10 మంది, రాజస్థాన్‌లో 14 మంది మృతిచెందారు. మరో రెండు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఈఏడాది సాగుకు అవసమైన వర్షపాతం నమోదు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు..

నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తుండటంతో వరుణుడు కరుణిస్తున్నాడు. . తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, జార్ఖండ్, బీహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ మీదుగా తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికితోడు చత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ తెలిపింది.

బిహార్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఖగారియా, బంకలలో ముగ్గురు మరణించగా, ఇద్దరు జాముయిలో, బుక్సార్, బెగుసారై జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందినట్లు వెల్లడించారు. మరణాలపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు బిహార్‌లోని ఈశాన్య జిల్లాలలో మరో రెండు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

Next Story

RELATED STORIES