ఆ రనౌట్ మిస్ వెనుక అసలు కథ

ఆ రనౌట్ మిస్ వెనుక అసలు కథ

ఇంగ్లండ్‌ ఉమెన్‌ క్రికెటర్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ మహిళా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో జరిగిన సన్నివేశం చూసి అంతా షాక్‌ అవుతున్నారు.. పక్కనే ఉన్న అంపైర్‌సైతం కేట్‌ క్రాస్‌ చేసిన పని చూసి ఒక్కసారిగా నివ్వెర పోయాడు. ఇంతకీ ఇంగ్లీష్‌‌ ఉమెన్‌ క్రికెటర్‌ను చూసి ఎందుకు అంతా షాక్‌కు గురవుతున్నారు..

భారత్‌, పాక్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను రనౌట్‌ చేసే అవకాశాన్ని చేజేతులా జారవిడ్చుకున్న పాక్‌ ఫీల్డర్లపై నెటిజన్ల కామెంట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో హాస్యాస్పద సంఘటన వైరల్‌ అవుతోంది. విండీస్‌, ఇంగ్లాండ్‌ మహిళా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్‌ కేట్‌ క్రాస్‌ చేసిన ఓ పొరపాటు ట్రోల్‌ అవుతోంది..

కేట్‌ క్రాస్‌ వేసిన బంతిని వెస్టిండీస్‌ బ్యాట్‌ ఉమెన్‌ సింగిల్‌ తీయడానికి ప్రయత్నించింది. స్ట్రైకర్‌ క్రీజ్‌లోకి చేరకముందే ఇంగ్లాండ్‌ ఫీల్డర్‌ కేట్‌ క్రాస్‌కు బంతిని అందింది. ఆమె వెంటనే చేతిలో ఉన్న బంతిని.. తన దగ్గర ఉన్న వికెట్లను కొట్టకుండా.. నాన్‌స్ట్రైకర్‌ను ఔట్‌ చెయ్యడానికి వికెట్‌కీపర్‌ వైపు బంతిని విసిరింది. అసలు తన పక్కనే ఉన్న వికెట్లను కొట్టి ఉంటే.. అక్కడ ఎవరూ లేరు దీంతో రౌనట్‌ లభించేంది.. కానీ పక్కన ఉన్న వికెట్లను వదిలి.. కీపర్‌ వైపు బంతి విసరడంతో రనౌట్‌ చేసే అవకాశాన్ని కేట్‌ క్రాస్‌ చేజేతులా జారవిడుచుకుంది.

కేట్‌ క్రాస్‌ చేసిన పొరపాటుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. స్ట్రైకర్‌ను ఔట్‌ చెయ్యకుండా నాన్‌స్ట్రైకర్‌ను ఔట్‌ చేసే సత్తా మీకు మాత్రమే ఉందని, తమ ఆట తీరుతోనే కాదు.. తమ తెలివితోనూ అందరిని ఆకట్టుకుంటున్నారని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. మీరు రనౌట్‌ చేయకపోయేసరికి అంపైర్‌ కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్‌ 42 పరుగుల తేడాతో గెలిచింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 138 పరుగులే చేసింది. రనౌట్‌ మిస్‌ చేసిన కేట్‌ క్రాస్‌ మూడు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story