మెదడు వాపు వ్యాధితో చనిపోతున్న చిన్నారులు

మెదడు వాపు వ్యాధితో చనిపోతున్న చిన్నారులు

బీహార్‌లోని ముజఫర్‌ఫర్‌పూర్ జిల్లాలో మెదడు వాపు వ్యాధితో వందలాదిమంది చిన్నారులు చనిపోతున్నారు. ఇప్పటికే 117కి పైగా చిన్నారులు చనిపోయారు. చిన్నారుల ప్రాణాల్ని ప్రభుత్వం కాపాడలేకపోతోంది, అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడంలేదంటూ బీహార్‌కు చెందిన అజ్మానీ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీఎం నితీష్ కుమార్‌కు అంక్షింతలు వేసింది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం.... బీహార్‌తో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది..

పిల్లల మరణాలకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీం కోర్టుకు అందించాలని బీహార్‌ను అదేశించింది. వ్యాధిని ఎదుర్కొనేందుకు నితీష్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. అటు సీఎం నితీష్ కుమార్ మాత్రం.. చిన్నారుల మరణాలపై సరిగా స్పందించడం లేదు. మీడియా ప్రశ్నించినా సీరియస్‌ అవుతున్నారు. మృతుల కుటుంబాలకు కేవలం 4 లక్షల రుపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి కొనసాగడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తూతూ మంత్రపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని సూచించింది. విచారణను 10 రోజులపాటు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story