పీటలపై ఆగిన పెళ్లి.. కారణం తెలిస్తే..

పీటలపై ఆగిన పెళ్లి.. కారణం తెలిస్తే..

గుంటూరు జిల్లాలో పీటలపై ఓ పెళ్లి ఆగిపోయింది. వధువును కాదని పీటల మీద నుంచి లేచిపోయాడు పెళ్లి కొడుకు. అసలు పెళ్లెందుకు ఆగిపోయింది? కారణమేంటనే కదా మీ డౌట్‌. దానికి కారణం వధువు ఆధార్ కార్డ్‌లో పేరు చివర రెడ్డి లేక పోవడమే. పేరు చివర రెడ్డిలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు పెళ్లి కొడుకు, తల్లిదండ్రులు... పెళ్లిని మధ్యలోనే ఆపేశారు. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

క్రోసూరు మండలం గాదెవారిపాలెంకు చెందిన యువతితో...సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన మున్నంగి వెంకటరెడ్డితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. పెదకాకాని శివాలయంలో పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో వధువు మెడలో తాళికట్టాల్సి ఉండగా.. పెళ్లి కూతురు పేరు ఆధార్ కార్డులో రెడ్డి అని లేకపోవడంతో పెళ్లిని ఆపేసి పందిట్లోంచి వెళ్లిపోయారు. అర్థాంతరంగా పెళ్లి ఆగిపోవడంతో ఆందోళన చెందిన వధువు తల్లిదండ్రులు.. క్రోసూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

కూతురు పెళ్లి ఆగిపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. దేశమంతటా కులాంతర వివాహాలు జరుగుతుందే.. ఇంకా కొన్ని చోట్ల కులం, మతం అంటూ పందిట్లో పెళ్లుళ్లు ఆపేయడంపై విమర్శలు వస్తున్నాయి. విచిత్రంగా పేరు చివర రెడ్డి లేదంటూ పెళ్లిని ఆపేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story