పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ.. ప్రేమజంట ఆత్మహత్య

పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ.. ప్రేమజంట ఆత్మహత్య
X

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజధాని థియేటర్‌ సమీపంలో ఓ ప్రేమజంట కూల్‌డ్రింక్‌లో గుళికలు కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రేమికుడు మృతి చెందగా యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. వీరు నల్గొండ జిల్లా రంగారెడ్డిగూడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

సందీప్‌రెడ్డి, త్రివేణిలు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు దగ్గరి బంధువులే అయినప్పటికీ ఇరుకుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పుకోరన్న కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ జంట.. తాము మరణించాక సమాధులు పక్కపక్కనే ఉంచాలని సూసైడ్‌ నోట్‌ రాసినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story

RELATED STORIES