వరదలో చిక్కుకున్న స్కూల్‌ వ్యాన్

వరదలో చిక్కుకున్న స్కూల్‌ వ్యాన్
X

ఉత్తరప్రదేశ్‌లోని కుశీనగర్‌లో ఓ స్కూల్‌ వ్యాన్ వరదలో చిక్కుకుంది. ఫ్లైఓవర్ కిందనున్న మార్గం వర్షాల కారణంగా పూర్తిగా నిండిపోయింది. దీన్ని సరిగా అంచనా వేయలేని డ్రైవర్.. బస్సును నీళ్లలోనే మందుకు పోనిచ్చాడు. అది మధ్యలో ఆగిపోయింది. దీంతో.. పిల్లలంతా భయాందోళనకు గురయ్యారు.చివరికి స్థానికులు వాళ్లను కాపాడారు. ఆ దారిలో వెళ్లొద్దని తాము హెచ్చరించామని ఐనా డ్రైవర్ మొండిగా వ్యవహరించాడని స్థానికులకు పోలీసులు చెప్పారు. దీంతో.. పిల్లల ప్రాణాలతో చెలగాం ఆడిన డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు పెట్టారు.

Next Story

RELATED STORIES