ప్రజావేదిక వద్దకు పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఉండవల్లిలోని...... ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తి కావస్తోంది. ప్రజావేదిక అక్రమ కట్టడమని , నిబంధనలకు విరుద్దంగా దీన్ని నిర్మించారన్న సీఎం జగన్... దీన్ని కూల్చివేయాలంటూ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో.. సీఆర్‌డీఏ అధికారులు.... ప్రజావేదికను కూల్చివేస్తున్నారు. మరో రెండుగంటల్లో... ప్రజావేదిక నేలమట్టం కాబోతోంది.
ప్రజావేదికను కూల్చివేస్తుండగా..మరోవైపు..... అక్కడికి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజావేదిక వద్దకు వెళ్లే రోడ్డు తమ భూముల్లో వేశారంటూ ఆందోళకు దిగారు. రోడ్డును తొలగించి... తమ భూముల్ని అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశ్, సాంబశివరావు అనే రైతులు ఏకంగా ఒప్పంద పత్రాలను తీసుకొచ్చారు.
ఇక ప్రజా వేదిక రోడ్డు తొలగిస్తే... మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు రాకపోకలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చంద్రబాబు సైతం ఇదే రోడ్డు నుంచే తన నివాసానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com