Top

ప్రజావేదిక కూల్చివేత.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న..

ప్రజావేదిక కూల్చివేత.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న..
X

టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం మధ్య ప్రజా వేదిక కూల్చివేత కొనసాగుతోంది. నిన్న అర్థరాత్రి నుంచి మొదలైన కూల్చివేత ప్రక్రియ 90 శాతం పూర్తైంది. మరో రెండు, మూడు గంటల్లో ప్రజావేదిక భవనం నేలమట్టం కానుంది. ఎలాంటి ఉద్రికత్తలు చోటు లేకుండా ప్రజా వేదిక పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి పెద్ద సంఖ్యలో కూలీలు సమ్మెటలతో రంగంలోకి దిగారు. మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లను తీసుకువచ్చారు. తొలుత ప్రజా వేదిక ముందు ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చివేశారు. ఈ ఉదయం నుంచి భవనం కూల్చివేత ప్రక్రియ మరింత ఊపందుకుంది. కూల్చివేతను సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ప్రజా వేదిక చుట్టూ రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం సరైన నిర్ణయం కాదని టీడీపీ ప్రశ్నిస్తుంటే... చంద్రబాబు అక్రమంగా నిర్మించారని.. అందుకే కూల్చేశామని వైసీపీ చెబుతోంది. చంద్రబాబు ప్రజావేదికను తమకు కేటాయించాలని కోరినందువల్లే జగన్ కక్షపూరితంగా వ్యవహరించి ప్రజావేదిక కూల్చివేతకు పూనుకున్నారని టీడీపీ విమర్శిస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో ఎవరూ అతీతులు కారని.. చట్టం ప్రకారం ప్రభుత్వం ముందుకు పోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES