తాజా వార్తలు

ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి గుండెపోటుతో మృతి

ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి గుండెపోటుతో మృతి
X

ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి అర్జున్‌ రెడ్డి సిడ్నీలో గుండెపోటుతో మృతి చెందాడు. అతను ఉద్యోగం చేస్తున్న సంస్థ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. అర్జున్‌ మరణ వార్త విని హైదరాబాద్‌లోని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన 36 ఏళ్ల సామ అర్జున్‌ రెడ్డి గత కొంత కాలంగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్టవేర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసిన మాట్లాడిన అర్జున్‌.. మధ్యాహ్నానికి గుండెపోటుతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

అర్జున్‌రెడ్డికి భార్య మహేశ్వరి, కుమార్తె ఇషిక ఉన్నారు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా వలిగొండ మండలం గొల్లపల్లి గ్రామం. ఆస్ట్రేలియా నుంచి డెడ్‌బాడీని హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Next Story

RELATED STORIES