తాజ్ మహల్ కృష్ణానది ఒడ్డున లేదు కాబట్టి సరిపోయింది : ఎంపీ కేశినేని నాని

X
TV5 Telugu27 Jun 2019 4:03 AM GMT
ప్రజావేదిక కూల్చివేయడంపై టీడీపీ నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ కృష్ణానది ఒడ్డున లేదుకాబట్టి సరిపోయింది.. లేదంటే ఇది కూడా ప్రజావేదిక లాగా కూలిపోయేదంటూ నాని ఎద్దేవా చేశారు. యూపీలోని యమునా తీరంలో ఉండబట్టి తాజ్ మహల్ సేఫ్ గా ఉందన్నారు. అలాంటి చారిత్రక నిర్మాణం ఇక్కడ ఉంటే నేలమట్టం అయ్యేదన్నారు. ఫేస్ బుక్ లో ఎంపీ నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story