విజయనిర్మల కన్నుమూత

విజయనిర్మల కన్నుమూత
X

ప్రముఖ తెలుగు సినీ నటి, దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న విజయ నిర్మల.. కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం.

Next Story

RELATED STORIES