గోదావరి–కృష్ణా అనుసంధానమే లక్ష్యంగా సీఎంల భేటీ

గోదావరి–కృష్ణా అనుసంధానమే లక్ష్యంగా సీఎంల భేటీ

తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కారించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి పెట్టారు. విభజన సమస్యలతో పాటు, జలవనరులను సద్వినియోగం చేసుకునేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న ఇద్దరు సీఎంలు ఇవాళ ప్రగతిభవన్ లో భేటి కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పెండింగ్ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్‌, సీఎం జగన్. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయ భవనాలతో పాటు హెచ్‌ఓడీ ల భవనాలను తెలంగాణకు అప్పగించారు. ఇక. మిగిలిన సమస్యల్ని పరిష్కరించేందుకు ఇవాళ భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో... గోదావరి నీటిని కృష్ణాబేసిన్ లోకి మళ్లించడం , విద్యుత్ డిస్కంల బకాయిలు, ఉద్యోగుల విభజన, ఏపి భవన్ విభజన అంశాలు భేటీలో కీలకం కానున్నాయి...

విభజన జరిగి ఐదేళ్లవుతున్న షెడ్యూలు 9,10 సంస్ధల విభజన ఇంకా కొలిక్కి రాలేదు. ఆస్తులు అప్పుల పంపిణితో పాటు విద్యుత్ సంస్ధలో డిస్కంల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ డిస్కంలు దాదాపు పదకొండు వేల కోట్లు బకాయి ఉన్నాయని ఏపీ డిస్కమ్‌లు అంటుండగా... వారే 2500 కోట్లు బకాయి పడ్డారని తెలంగాణ డిస్కంలు వాదిస్తున్నాయి. అటు విద్యుత్ ఉద్యోగుల విభజనపై కూడా వివాదం నెలకొంది. 2015 లో 1157 మంది ఉద్యోగులను ఏపీ కి కేటాయించగా... ఆ ప్రభుత్వం తీసుకోకపోవడంతో.. వారంతా తెలంగాణలోనే పనిచేస్తున్నారు. 2018 లో కోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగులు పనిచేయకున్నా తెలంగాణ ప్రభుత్వమే వారికి జీతాలు చెల్లిస్తోంది.

ఇక నదీజలాలు, కృష్ణా గోదావరి నీళ్ల పంపిణి పై ఇప్పటికే సూచన ప్రాయంగా ఇరువురు సీఎంలు చర్చించారు.. గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లించే అంశం పై ఇరు రాష్ట్రాల ఇంజీనీర్లు అధ్యయనం చేస్తున్నారు.. కృష్ణా గోదావరి జలాలను రెండు రాష్ట్రాల్లో అవసరమైన మేరకు ఉపయోగించుకునేలా చర్చించనున్నారు ఇరువురు సీఎంలు. ఇక ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ విభజన పై వివాదం నెలకొంది.

పటౌడి హౌస్ భూమి పై తెలంగాణకు అదనపు హక్కులున్నాయని తెలంగాణ వాదిస్తోంది.నిజాం వారసత్వ ఆస్తిగా ఉన్న హైదరాబాద్ హౌస్ ను కేంద్రానికి ఇవ్వడం ద్వారా ప్రతిగా వచ్చిన 7.64 ఎకరాల భూమిని ఉమ్మడి ఆస్తిగా చూపవద్దంటోంది తెలంగాణ. 58 : 42 నిష్పత్తిలో ప్రతిపాదనలు సిద్దం చేశారు అధికారులు. ఈసమస్యను కూడా ఇందులో చర్చించనున్నారు. పరిష్కారం కాని సమస్యలపై దృష్టిసారించిన ఇద్దరు ముఖ్యమంత్రులు... ఈ సమావేశంలో వీటిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story