రివ్యూ: ‘బ‌్రోచేవారెవరురా’.. అంతా నీరసమే..

రివ్యూ: ‘బ‌్రోచేవారెవరురా’.. అంతా నీరసమే..
X

తెలుగు సినిమా తీరు మారుతుంది. కాంబినేషన్స్ కంటే కాన్సెప్ట్ లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. స్టార్ ఇమేజ్ ల స్టామినా కంటే కథలు, కథనాలు దమ్ముగా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతున్నాయి. పదిమందిలో ఒకడిగా కనిపించే పాత్రలనుండి హీరోగా ఎదిగిన శ్రీవిష్ణు ప్రయాణం లో బ్రోచేవారెవరురా.. స్పెషల్ గా అనిపించింది. మెంటల్ మదిలో తర్వాత అదే దర్శకుడితో శ్రీవిష్ణు చేసిన ఈ క్రైం కామెడీ ఎలా ఉందో చూద్దాం..

కథ:

శ్రీవిష్ణు (రాహుల్) ప్రియదర్షి (రాఖీ ) రాహుల్ రామకృష్ణ (ర్యాంబో) ముగ్గురు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఇంటర్ ని మూడేళ్ళగా చదువుతున్న వీరి కాలేజ్ లోకి మిత్ర ( నివేదా థామస్) వస్తుంది. కాలేజీ ప్రిన్సిపల్ కూతురు అయినా వీరి కి స్నేహం కుదరుతుంది. మిత్ర తన ఇంట్లో కష్టాలు రాహుల్ తో పంచుకుంటుంది. ఆమెను ఇంటి నుండి బయటకు పంపించేందుకు రెడీ అవుతారు ఫ్రెండ్స్. ఒక చిన్న గేమ్ ఆడి ఆమెను హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ లో ఉండే గౌతమ్ ( సత్యదేవ్) డైరెక్షన్ ట్రైయిల్స్ లో ఉంటాడు. హీరోయిన్ షాలినీ( నివిథాపేతురాజు) ను కలసి కథ చెబుతాడు. తన తండ్రి యాక్సిడెంట్ అయితే హాస్పటల్ కి డబ్బుతో వెళుతున్న గౌతమ్ డబ్బు మిస్ అవుతుంది. మిత్ర కోసం హైదరాబాద్ కి వచ్చిన రాహుల్ సత్యదేవ్ కి సమస్యలా మారతాడు. రాహుల్ హైదరాబాద్ కి ఎందుకు వచ్చాడు..? గౌతమ్ సమస్య నుండి ఎలా బయటపడతాడు అనేది మిగిలిన కథ..?

కథనం:

బ్రోచేవారెవరురా..? ఈ టైటిల్ లాగానే సినిమా కూడా అందరికీ అర్దం కాదు.. దర్శకుడు తన స్ర్కీన్ ప్లే టెక్నిక్ ని ప్రదర్శించే పనిలో ఒక చిన్న పాయింట్ ని లాగి లాగి ఒక పెద్ద షాట్ ఫిల్మ్ చూసిన ఫీల్ తెచ్చాడు. అందులోనూ శ్రీ విష్ణు ఇంటర్ చదువుతున్న కుర్రాడిలా ఊహించుకోవడం ఎంత ఇబ్బందో ఈ సినిమా అంతా కూడా అదే ఇబ్బంది కలిగించింది. సినిమా ఎక్స్ పీరియన్స్ కి షార్ట్ ఫిల్మ్ ఎక్స్ పీరియన్స్ కి తేడా ఉంటుంది. తీరిగ్గా కూర్చొని మెబైల్ లో చూసి బాగుంది అనుకోవడానికి థియేటర్ లో కొంత ఖర్చు పెట్టి చూసిన సినిమా బాగుంది అనుకోవడానికి తేడా ఉంటుంది. ఆ తేడా తెలియని దర్శకుడు చేసిన ప్రయత్నమే ‘బ్రోచేవారెరురా’. మెంటల్ మది లో లాగానే సేమ్ ఫార్మెట్ లో కథను నడిపాడు. ఫస్టాఫ్ లో చూసిన సీన్ కి ఎక్స్ టెన్షన్ గా సెకండాఫ్ గా మరో సీన్ కనపడుతుంది. దర్శకుడు చూపించిన కథ, ఇంకో లాగా అర్దం అవడం మొదలు పెట్టాక అసలు కథ తెలస్తుంది. ఈ టెక్నిక్ బాగున్నా.. మొదటి సినిమాకి , రెండో సినిమాకి అదే వాడటంతో విసుగు వచ్చింది. నివిథా థామస్ క్యారెక్టర్ ని గొప్పగా ఊహించుకునేంత లేదు. ఇక ఆమె తండ్రి పాత్రను చేసిన ఆర్టిస్ట్ మంచి నటన కనబరిచాడు. అతని ఫ్రెండ్ గా నటంచిన హార్ష వర్ధన్ తండ్రి, కూతుళ్ళ మద్య రిలేషన్ గురించి చెప్పే సన్నివేశం బాగుంది. ఇంటి కంటే సేఫ్ ప్లేస్ ఎక్కడా లేదు అనడానికి ఇంత కథను చెప్పాలా అనిపించింది. శ్రీ విష్ణు కంటే ప్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన ప్రియదర్శి, రాహుల్ నటన లో ఈజ్ కనపడింది. ఇక సత్యదేవ్, నివిథా పేతురాజ ల కథ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇక సెంకడాఫ్ లో కథను మరింత సాగ దీసాడు దర్శకుడు . ఒక పాయింట్ చుట్టూ గిరా గిరా తిరుగుతుంది కథ.అందులోనే ఛేజ్ లు, అందరూ పరిగెత్తుకుంటూ ఒకే ఏరియా కి రావడం వంటి సినిమాటిక్ సన్నివేశాలతో కథ తిరుగుతూ ఉంటుంది. సీరియస్ గా సాగుతున్న కథ లో కామెడీ పేరుతో దర్శకుడు చేద్దామనుకున్న టైం పాస్, ఫెయిల్ అయ్యింది. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా లో ఎగ్జైట్ అయ్యే సందర్బాలు ఏవీ లేకపోవడం, కథనం అంతా మరీ స్లోగా సాగడం బ్రోచేవారెవరురా చూస్తున్న ప్రేక్షకులకి నీరసం తెప్పించాయి.

చివరిగా:

అంతా నీరసమే..

Next Story

RELATED STORIES