తాజా వార్తలు

బస్టాండు, రైల్వే స్టేషన్లలో పాపడ్లు అమ్ముకుంటున్న హీరో..

బస్టాండు, రైల్వే స్టేషన్లలో పాపడ్లు అమ్ముకుంటున్న హీరో..
X

స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి అంతలోనే ఏమైంది.. ఎందుకిలా.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో అని ఫిక్సయిపోతున్నారు కదూ.. ఆగండాగండి.. అంత దూరం ఆలోచించకండి. తను నటిస్తున్న ఓ సినిమాలోని పాత్ర కోసం పాపడ్లు కొనమని ప్రయాణీకులను ప్రాధేయపడుతున్నాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. కెరీర్‌ని ప్యాషన్‌గా తీసుకున్న హీరో హీరోయిన్లు డీగ్లామర్ పాత్రలు చేయడానికి వెనుకాడరు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అభిమానుల ప్రశంశలందుకుంటారు. సూపర్ 30 అనే చిత్రంలోని ఆనంద్ పాత్ర కోసం హృతిక్ ఇలా కనిపిస్తాడు. గణిత శాస్త్రవేత్త ఆనంద్ జీవితాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. మారు మూల చిన్న గ్రామంలో పెరిగి పెద్దవాడైన ఆనంద్ గణితంలో పట్టభద్రుడై.. ఐఐటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం.. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం వంటి విషయాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఆనంద్ పాపడ్‌లు అమ్ముకుంటూ జీవనం సాగించిన అంశం చాలా కీలకమైంది. ఆ సమయంలో ఆనంద్ పడిన భావోద్వేగం హృద్యంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వికాస్ భల్. ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాపడ్లు అమ్ముతున్న పిక్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఈ ఘట్టం ఆనంద్ జీవితంలో మలుపు తిరిగిన అంశం అని హృతిక్ పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES