క్షణంలో తల్లి ఆ బిడ్డని.. వీడియో చూస్తే..

క్షణంలో తల్లి ఆ బిడ్డని.. వీడియో చూస్తే..
X

అమ్మకి ఎంత ఏమరపాటు. బిడ్డని వదిలేసి ఫోన్ మాట్లాడుతుంది. అదృష్టం బావుంది కాబట్టి సరిపోయింది. బిడ్డ బతికాడు. అదే జరగరానిది జరిగి ఉంటే.. బాబోయ్ చూస్తుంటేనే ఒక్క క్షణం శరీరం గగుర్పాటుకు గురవుతుంది. కొలంబియాకు చెందిన ఓ మహిళ తన బిడ్డతో కలిసి లిప్ట్‌లో నాలుగో ఫ్లోర్‌కు చేరుకుంది. లిప్ట్ నుంచి బయటకు వస్తూనే పిల్లాడిని పట్టుకుని ఫోన్ మాట్లాడుతూ వస్తోంది. వాడు అమ్మ చేయి విడిపించుకుని అక్కడే ఉన్న రెయిలింగ్ దగ్గరకు వెళ్లి చూస్తూ ముందుకు పడిపోయాడు. సెకన్ల వ్యవధిలో తల్లి ఫోన్ పడేసి బిడ్డ కాలు పట్టుకుని పైకి లాగింది. దీంతో బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారికి నోట మాట రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి బిడ్డను కాపాడుకున్న తల్లిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంత ధైర్యం అమ్మకు మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు.

Next Story

RELATED STORIES