విజయ నిర్మలకు ఘన నివాళి

విజయ నిర్మలకు ఘన నివాళి
X

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె మరణాన్ని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. నానాక్‌రాంగూడలోని ఆమె నివాసానికి తరలివచ్చిన ప్రముఖులు నివాళులర్పించారు. చిరంజీవి, జమునా, గీతాంజలి, జీవిత రాజశేఖర్‌, విజయశాంతి, మురళీమోహన్‌, రాఘవేంద్రరావుతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులు, రాజకీయ రంగ ప్రముఖులు విజయనిర్మల పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. .

విజయనిర్మల మృతిపై అన్ని రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు.. విజయనిర్మల మృతికి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. నానక్‌రామ్‌గూడలోని నివాసానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ కృష్ణను ఓదార్చారు. ఆయనకు ధైర్యం చెప్పారు...

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయనిర్మల పార్థీవ దేహానికి నివాళులర్పించారు. విజయనిర్మల మృతి సినీపరిశ్రమకు తీరని లోటన్నారు. దర్శకురాలిగా, నటిగా ఆమె ఘన విజయం సాధించారన్నారు. .

ఇవాళ ఉదయం 11 గంటలకు విజయనిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. పార్దవదేహం నానక్‌రామ్‌గూడ ఇంట్లో ఉంది. ఇవాళ ఫిల్మ్‌చాంబర్‌కు తరలించనున్నారు. అక్కడనుంచి చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌ వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. అనంతరం అంత్యక్రియలు జరగనున్నాయి.

Next Story

RELATED STORIES