గురువారం అందరూ బస్సులో రావాల్సిందే!

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కలెక్టర్ హెబ్సిబా రాణి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ.. ఇకపై ప్రతి గురువారం బస్సుల్లో కార్యాలయాలకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు కలెక్టర్ అదేశాలను గౌవరవిస్తూ అందరూ బస్సుల్లోనే కలెక్టరేట్‌కు వస్తున్నారు. వారితో
తాను కూడా బస్సులో కలెక్టరేట్‌కు వస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పరిసరాల సంరక్షణపై హెబ్సిబా రాణి చూపిస్తున్న శ్రద్ధ అందరీ ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆమె మెుదలు ఈ ప్రయత్నానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. బస్సుల్లో ప్రయణీంచడానికి సాధారణ ప్రజల కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మొదటి గురువారం బస్టాండ్లు ప్రభుత్వ ఉద్యోగులతో కిటకిటలాడాయి.
ఉడిపి నగరంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఆందరూ మొదటి గురువారం విధులకు బస్సుల్లో బయలుదేరారు. ఈ కారణంగా బస్టాండ్‌లు ప్రముఖ సర్కిళ్లు ప్రయాణీకులతో సందడిగా మారాయి.
ఇలాంటి చర్యలతో కాలుష్య సమస్యకు కొంతవరకైనా పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హెబ్సిబా రాణి అన్నారు. ‘ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి గురువారం స్సుల్లో విధులకు రావాలని ఆదేశాలు జారీ చేశాను’ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com