తాజా వార్తలు

కారు డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని..

కారు డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని..
X

కారు డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్న డ్రైవింగ్ స్కూల్ యజమానిని చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు. అల్వాల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో ఈఘటన చోటు చేసుకుంది. వైఎస్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ యజమాని ఏసుబాబు వద్దకు డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి డిగ్రీ స్టూడెంట్‌ రాగా.. ఆ అమ్మాయిని బలాత్కారానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో కేసు నమోదు చేయకుండానే నిందితున్ని మందలించి వదిలేశారు అల్వాల్ పోలీసులు.

Next Story

RELATED STORIES