కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు..

కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు..

కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా ఉపసంహరించుకోవాలని ఆపార్టీ కీలక నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాహుల్ గాంధీ వెనక్కి తగ్గకపోతే తాము కూడా రాజీనామాలు చేస్తామని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు రాజీనామాల పర్వానికి తెరతీశారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి పొన్నం ప్రభాకర్‌ , హర్యానా పీసీసీ చీఫ్ సునేత్ర చౌదరి, ఢిల్లీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్‌ కూడా రాజీనామా చేసి రాహుల్ గాంధీకి పంపించారు. ఒక్కరోజులోనే 145 మంది తమ పదవులకు రాజీమాలు చేశారు .

రాహుల్ గాంధీకి తన టీంను తానే ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని స్వచ్ఛందంగా తమ పదవులను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు పీసీపీ , ఏఐసీసీ అనుబంధ విభాగాలకు చెందిన పలువురు నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అటు ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ పూర్వ, ప్రస్తుత అధ్యక్షలు సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రతిష్ఠంభనను తాము ఎక్కువ కాలం భరించే స్థితిలో లేమని, ఈ ప్రతిష్ఠంభనను తొందరగా పరిష్కరించాల్సిన అవసరం రాహుల్‌పై ఉందని నేతలు పేర్కొన్నారు. తిరిగి పార్టీని పోరాటాల వైపు నడిపించాలని కోరారు. రాజీనామాలతో ఖాళీలైన పోస్టుల్లో సమర్థులను ఎన్నుకోవాలని రాహుల్‌కు సూచించారు నేతలు.

Tags

Read MoreRead Less
Next Story