పెళ్లి చేసుకోవాలనుకునే వారికి చేదువార్త

కుదరక..కుదరక పెళ్ళి కుదిరింది. త్వరలో పెళ్ళి చేసుకుని ఓ ఇంటివారు అవుదాం అనుకున్న సీనియర్ బ్యాచ్‌లర్లకు పంతుల్లు చేదు వార్త చేప్పారు. మరో మూడు నెలల వరకు మూహర్తాలు లేవని, పెళ్ళి చేసుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా కొద్దిరోజులు వేచి చూడాలని చెబుతున్నారు.
జూలై 2వ తేదీన ఆషాఢ మాసం మొదలవుతుంది. ఈ మాసం ఆగస్టు 1వ తేదీ వరకు ఉంటుంది. ఆ మాసంలో సాధరణంగా వివాహాది శుభ కార్యాలు ఉండవు. ఆ ఆషాఢం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. అయితే సాధరణంగా ఈ మాసంలో వివాహాలు ఉంటాయి. కానీ ఆ నెలలో శుక్ర మూఢమి వల్ల పెళ్ళిలు జరగవు.దీంతో 3 నెలల పాటు ముహుర్తాలు లేవు. జూలై 7వ తేదీన రాత్రి 2.38 గంటలకు శుక్ర మూఢమి ప్రారంభమై సెప్టెంబర్ 20వ తేదీన ఉదయం 6.07 గంటలకు ముగుస్తుంది. దీంతో దాదాపు 3 నెలలు పెళ్ళిలకు దూరంగా ఉండాల్సిందే. మూడళ్ళు అక్టోబర్ నెలలో ముగుస్తాయి. ఆ నెల 2 నుంచి వివాహ ముహూర్తాలను పెట్టుకోవచ్చు.
అప్పుడే బ్యాచ్‌లర్లు పెళ్ళికి తోందరపడాలి లేదంటే మళ్ళీ డిసెంబర్‌లో మూఢళ్ళు ఉన్నాయి. డిసెంబర్ 13 రాత్రి 1.11 గంటల నుంచి 2020 జనవరి 10వ తేదీ రాత్రి 10.23 గంటల వరకు మూఢమి కొనసాగుతుంది. కావున మరో నెల రోజుల పాటు ముహుర్తాలు ఉండవు. గ్రహాలు బలహీనంగా ఉన్న సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరాదని మూహూర్త జాతకాలు గ్రందాలు చెబుతున్నాయి. దీంతో మంచి ముహూర్తాలు లేక పెళ్ళిలు వాయిదాలు పడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com