Top

కమలాదేవి ఎవరో మాకు తెలియదు : టీడీపీ నేత రెహమాన్

విశాఖ టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆపార్టీ నగర అధ్యక్షుడు రెహమాన్ స్పందించారు. చట్టబద్ధంగానే తమ పార్టీ నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు.ఇప్పుడు టీడీపీ కార్యాలయ నిర్మాణం అక్రమంటూ.. కమలా దేవికి చెందిన లింక్‌ డాక్యుమెంట్స్ సమర్పించలేదని నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు రెహమాన్. కమలాదేవి ఎవరో తమకు తెలియదన్నారు..

ప్రభుత్వ భూమిగా పరిగణించిన ఆభూమిని.. 2001లో అప్పటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లకు పార్టీ కార్యాలయం కోసం విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు రెహమాన్‌. వారు కేటాయించిన 2వేల చదరపు అడుగులకు ప్రతి ఏటా లీజు కింద 20వేలు చెల్లిస్తున్నామని తెలిపారు.

నిబంధనల ప్రకారమే టీడీపీ కార్యాలయం నిర్మాణం కట్టడం జరిందని దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు నగర అధ్యక్షుడు రెహమాన్. జీవీఎంసీ అధికారుల నోటీసులపై రేపు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలో సమావేశమై చర్చిస్తామని ఆయన తెలిపారు.

Next Story

RELATED STORIES