విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు

విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు

ఇండియన్ పైలట్ అప్రమత్తత పెను ప్రమాదాన్ని తప్పించింది. ఆ పైలట్ అలర్ట్‌గా ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టం తప్పాయి. ట్రైనింగ్‌లో భాగంగా జాగ్వార్ యుద్ద విమానం హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి టేకాఫైంది. ఐతే కొన్ని క్షణాల్లోనే ఓ పక్షుల గుంపు విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఫ్లైట్‌ లోని ఓ ఇంజిన్ దెబ్బతిని మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో జాగ్వార్ విమానంలో ఇంధన ట్యాంకులు, క్యారియర్‌ బాంబ్‌ లైట్‌ స్టోర్స్‌ పేలుడు సామగ్రి ఉన్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్, సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. పక్షుల గుంపు విమానాన్ని ఢీకొట్టిన వెంటనే, ఫ్లైట్‌లో ఉన్న బాంబులు, ఇంధన ట్యాంకర్లను కిందకి జార విడిచాడు. ఆ తర్వాత విమానాన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు.

పైలట్ అలర్ట్‌గా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఏమాత్రం ఆలస్యమైనా ఇంజిన్‌ నుంచి ఎగిసిప డుతున్న మంటల ధాటికి అందులోని బాంబులు, ఇంధన ట్యాంకర్లు పేలి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించేది. పెను ప్రమాదాన్ని నివారించిన పైలట్‌పై భారత వైమానిక దళం ప్రశంసల వర్షం కురిపించింది. పైలట్‌ తీరు వైమానిక దళం ప్రదర్శించే అత్యున్నత విలువలకు నిదర్శనమని కితాబిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story