వైఎస్‌ఆర్‌ జయంతి రోజున కీలక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం

వైఎస్‌ఆర్‌ జయంతి రోజున కీలక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం

వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా.. ఈ నెల 8వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. వృద్ధులకు 3 వేల పెన్షన్‌ ఇస్తానంటూ నవరత్నాల మేనిఫెస్టోలో ప్రకటించారు జగన్‌. అయితే... ముందుగా 2వేల 250 రూపాయలు ఇచ్చి దశలవారిగా 3 వేలకు పెంచనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో... దీనిపై మొదటి సంతకం పెట్టారాయన. ఈ పెన్షన్ల పెంపును ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నారు.

గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ సెర్ఫ్‌పై సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. ఈ రివ్యూ మీటింగ్‌కు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హాజరయ్యారు. నవరత్నాల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పెన్షన్‌ అందేటట్లు చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. అర్హులైన ప్రతి ఒక్కరూ పించన్‌ అందుకునేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story