తాజా వార్తలు

కొత్తగూడెం ఎమ్మెల్యేపై కేసు నమోదు

కొత్తగూడెం ఎమ్మెల్యేపై కేసు నమోదు
X

కుమ్రం భీం జిల్లాలో అటవీ అధికారులపై దాడి ఘటన రచ్చ రచ్చ అవుతుండగానే.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కేసులో చిక్కుకున్నారు. సిబ్బంది డ్యూటీని అడ్డుకున్నారని వనమాపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. మరోవైపు.. అనితపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. సీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

కుమ్రంభీమ్‌ జిల్లా సర్‌సాలా దాడి ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అటవీ శాఖ ఉద్యోగ సంఘాలు. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఉద్యోగిపై దాడి చేయడం దుర్మర్గామన్నారు. హైదరాబాద్‌ అరణ్య భవన్‌లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశయ్యారు. అనంతరం సచివాలయానికి వెళ్లి సీఎస్‌కు కలిశారు. దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. విచారణ వేగవంతం చేయాలని వినతి పత్రం ఇచ్చారు.

రాజకీయ జోక్యం వల్లే అటవీ అధికారులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌. ఆయుధాలు ఇచ్చి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అడవిని కాపాడేందుకు తాము ముందుంటామని.. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం కావాలని కోరారు. దాడి చేసిన వారితో పాటు వారి వెనుకున్న పెద్దలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అటవీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. 33 జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. దాడినిపై నిరసన వ్యక్తం చేశారు. ఫారెస్ట్‌ అధికారులపై దాడి హేయమని.. బాధ్యులైన అధికార పార్టీకి చెందిన నేతలపై యాక్షన్ తీసుకోవాలని డియాండ్‌ చేశారు.

సర్‌సాలా రచ్చ కొనసాగుతుండగానే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అటవీ అధికారుల విధులకు ఆటంకం కలించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల ఫిర్యాదుతో వనమాపై, ఆయన కుమారుడు రాఘవేంద్రరావు సహా ఐదుగురిపై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. మొత్తంగా ఫారెస్ట్‌ ఆఫీసర్లపై దాడి ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

Next Story

RELATED STORIES