అందుకే 33వేల ఎకరాల భూమిని ఇచ్చారు

అందుకే 33వేల ఎకరాల భూమిని ఇచ్చారు

టీడీపీకి చరిత్ర ఉందన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.మరోసారి మనపై బాధ్యతలు పెరిగాయన్నారాయన. తొలిసారి గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంకు విచ్చేశారు. ఇవాల్టి నుంచి రోజూ కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉండనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 40శాతం ఓట్లను వేసిన ప్రజల కోసం పని చేయాలన్నారాయన. నీతి వంతమైన పాలన ఇచ్చామని, మనపై నమ్మకంతోనే 33వేల ఎకరాల భూమిని రైతులు ఇచ్చారన్నారు. రాజకీయ పార్టీ మనుగడకు కార్యకర్తలు చాలా అవసరమన్నారు చంద్రబాబు. 37 ఏళ్ళ పాటు పార్టీని, జెండాని మోసింది కార్యకర్తలేనన్న ఆయన... పార్టీ వలన నష్టం వచ్చిన కార్యకర్తలు పార్టీతో ఉన్నారన్నారు. పార్టీకి మూలస్తంభాలు పార్టీ కార్యకర్తలబపై దాడులు పెరిగాయన్న చంద్రబాబు... ఇప్పటి వరకూ ఆరుగురు చనిపోయారన్నారు. ప్రతి కార్యకర్తని కాపాడుకుంటామన్నారు చంద్రబాబు. ఇక్కడే ఉంటాను కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు చంద్రబాబు. తాను ఎలాంటి తప్పు చేయలేదని... అరాచకాలు చేయలేదని నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story